తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Sompu: సోంపు తింటే ఇన్ని లాభాలా! - సోంపు ఉపయోగాలు

చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అన్ని రకాల ఆహార పదార్థాలతోపాటు దీన్ని తప్పనిసరిగా పెడతారు. హోటల్స్‌లోనూ భోజనం చివర్లో ప్రత్యేకంగా అందిస్తారు. ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణమవుతుందనే.

sompu
sompu

By

Published : Jul 18, 2021, 12:10 PM IST

సోంపులో ఔషధ గుణాలుంటాయి. ఇది జీర్ణ సంబంధమైన సమస్యలతో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలామంది భోజనం తర్వాత సోంపు తింటారు. సోంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

  • సోంపు చాలా రుచిగా ఉండటమే కాదు ఔషధ గుణాలను కలిగి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
  • 100 గ్రాముల సోంపులో 40 గ్రా. పీచు ఉంటుంది. ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది.
  • జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తింటే ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
  • క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తరచూ ఆహారంతోపాటు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
  • ఆహారం సరిగా జీర్ణమవ్వాలంటే సోంపు తీసుకుంటే సరి. అలాగే ఆకలి పెరగాలన్నా దీన్ని తీసుకోవాల్సిందే.
  • గ్లాసు మజ్జిగలో చెంచా సోంపు వేసుకుని తాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయి.
  • కడుపు నొప్పితో బాధపడే చిన్నారులకు మజ్జిగలో కలిపిస్తే నొప్పి తగ్గుతుంది.
  • నోటి దుర్వాసనను తొలగించడంలో ఇది ముందుంటుంది. భోజనం చేసిన వెంటనే కొద్దిగా తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
  • సోంపును వంటల్లోనూ ఉపయోగిస్తారు. ఇది పదార్థాలకు సువాసనలతోపాటు రుచినీ పెంచుతుంది.

ABOUT THE AUTHOR

...view details