Effects on the Body Eating Without Hunger :ఒత్తిడి, ఆందోళన వంటివి చుట్టుముట్టినప్పుడు.. ఆ ప్రభావం మనసుపై ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ.. శరీరంపై ఎలా ఉంటుందో మాత్రం అందరికీ తెలియదు. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలకు లోనైనప్పుడు చాలా మంది ఆకలి లేకున్నా తింటుంటారు. మరికొంతమంది బోర్ కొడుతోంది అనుకుంటా ఏదో ఒకటి నోట్లో వేసుకుంటారు. మరికొన్ని సార్లు పక్కవారి బలవంతం వల్ల తినాల్సి వస్తుంది. మరి, ఇలా ఆకలి లేకున్నా తినడం వల్ల ఆరోగ్యం ఏమవుతుందో తెలుసా?
మీ పరుపు ఎన్నాళ్లకు మార్చేయాలి? - లేకపోతే ఏమవుతుంది?
రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం: ఆకలిగా లేనప్పుడు తినడం రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తిన్నప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్, టైప్ 2 డయాబెటిస్‌తో సహా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మీ కళ్లు ఎర్రగా మారుతున్నాయా? - ఈ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి!
వేగంగా బరువు పెరగడం:ఎలాంటి కారణం లేకుండా తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రోజువారీ అవసరాల కంటే ఎక్కువ కేలరీలను ఇస్తుంది. ముఖ్యంగా మనలో చాలా మంది క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. టీవీ చూడటం, మొబైల్ ఫోన్ వాడేటప్పుడు.. ఇలా రకరకాల పనులు చేసేటప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని లాగించేస్తాం.. దీంతో ఈజీగా బరువు పెరుగుతాం..
బరువు తగ్గడానికి రొట్టె తింటున్నారా?
జీర్ణవ్యవస్థపై ప్రభావం:ఆకలి లేకుండా తినడం అంటే అవసరానికి మించి ఆహారాన్ని తినడమన్నట్లే. ఈ అలవాటు జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం కావొచ్చు. ఈ కారణంగా కడుపులో ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా జీర్ణ ప్రక్రియ మానసిక, శారీరక ప్రక్రియల ద్వారా ప్రభావితమవుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. మనం తింటున్న వాటి గురించి పట్టించుకోకపోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ 30% నుంచి 40% తక్కువ ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమైంది.