తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2021, 8:12 AM IST

ETV Bharat / sukhibhava

ఆకుకూరలు తినండి.. కండరాల బలం పెంచుకోండి!

కండరాలు బలంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఆకుకూరలు తిని చూడండి. ఆకుకూరల్లోని నైట్రేట్ల వల్ల కండరాలు బలంగా తయారవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leafy Vegetables
ఆకుకూరలు

కండరాలు బలంగా ఉండాలని కోరుకుంటున్నారా? కింద పడిపోయే ముప్పు తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే రోజూ పాలకూర వంటి ఆకుకూరలు తిని చూడండి. ఇవి కండరాలు బలోపేతం కావటానికి, ఫలితంగా వృద్ధాప్యంలో కింద పడిపోయే ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇదంతా ఆకుకూరల్లోని నైట్రేట్ల గొప్పతనం. రోజుకు ఒక కప్పు ఆకుకూరలు తిన్నా కండరాల సామర్థ్యం, పనితీరు మెరుగవుతుంది. ప్రతి రోజూ 12 ఏళ్ల పాటు ఆకుకూరలు తిన్నవారిలో కాళ్ల బలం 11%, నడక వేగం 4% ఎక్కువగా ఉంటున్నట్లు ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో సంబంధం లేకుండానే ఈ ప్రయోజనాలు కనిపిస్తుండటం విశేషం. అలాగని వ్యాయామం అవసరం లేదనుకోవద్దు. బరువులు ఎత్తటం వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలకు ఆకుకూరలు తినటమూ తోడైతే మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. వయసు మీద పడుతున్నకొద్దీ ఆహారం మీద శ్రద్ధ ఇంకాస్త ముఖ్యం. కాళ్లు బలంగా ఉంటే కింద పడిపోవటం, ఎముకలు విరగటం వంటి ముప్పులు తగ్గుతాయి. ఆకుకూరలు మొత్తంగానే ఆరోగ్యానికీ.. ప్రధానంగా గుండెకూ ఎంతో మేలు చేస్తాయి.

ఇవీ చూడండి: నడుంనొప్పి వేధిస్తుందా?- 15 నిమిషాలు ఇలా చేస్తే..

ABOUT THE AUTHOR

...view details