Dry Friuts: చాలామంది వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా ఉండేందుకు ఎన్నో రకాల ట్రీట్‌మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. వేలకు వేలు డబ్బులు పెట్టినా ఫలితాలు రాక నష్టపోయిన వారున్నారు. మనం తినే ఆహారంతో ఆరోగ్యం సొంతమైతే ఇతర ట్రీట్‌మెంట్ల అవసరమేముంటుంది? కాబట్టి రుచిగా ఉండి ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవటం మంచిది.
బాదం:ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో బాదం ఒకటి. ఇందులో ఉండే విటమిన్ ఈ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది.
పిస్తా:పిస్తాల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు చర్మంపై మొటిమలు రాకుండా సహాయపడతాయి.
జీడిపప్పు:శరీరానికి కావాల్సిన మినరల్స్, అమైనో ఆమ్లాలు, ఫైబర్ జీడిపప్పులో పుష్కలంగా దొరుకుతాయి. వీటిని నేరుగా కూడా తీసుకోవచ్చు.
డేట్స్:
* తక్షణ శక్తిని అందించే వాటిల్లో డేట్స్ ఒకటి. ఇవి రోజూ తినటం వల్ల ఉత్సాహంగా ఉంటారు.
* ఉదయం లేవగానే నానబెట్టిన బాదం పలుకులు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.