తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బరువుకు నీటితో కళ్లెం వేయండిలా.. - మలబద్ధకం

బరువుగా ఉన్న వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అందంగా కనిపించడం లేదని తెగ బాధపడుతుంటారు. అలాంటి వారు ఆ సమస్యను నీటితో చెక్​ పెట్టేయొచ్చు.

drinking-too-much-water-can-help-you-lose-weight
బరువుకు నీటితో కళ్లెం వేసేద్దామిలా!

By

Published : Apr 29, 2020, 11:07 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

తిన్న ఆహారం సరిగా జీర్ణం కావటం, మలబద్ధకం దరిజేరకుండా చూడటం వంటి వాటికే కాదు.. బరువు తగ్గటానికీ నీరు తోడ్పడుతుంది.

కేలరీలు మరింత ఎక్కువగా ఖర్చు కావటంలో ఇది బాగా తోడ్పడుతుంది. తగినంత నీరు తాగటం వల్ల సుమారు గంటన్నర వ్యవధిలో జీవక్రియల వేగం 24-30% వరకు పెరుగుతున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. అంటే ఇది అదనంగా మరో 96 కేలరీలు ఖర్చు అవటంతో సమానమన్నమాట. భోజనం చేయటానికి అరగంట ముందు నీరు తాగటం మరీ మంచిది. ఇది బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది. బరువు పెరుగుతున్నామని బాధపడేవారు ఎక్కువ నీరు తాగండి. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.

ఇదీ చదవండి:'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details