తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

టొమాటో తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా! - Health Benefits Of Eating Tomato

Health Benefits Of Eating Tomato: వరసగా రెండు వారాలపాటు టొమాటోల్ని ఆహారంలో భాగంగా అధికంగా తినడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియా మారుతుందని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగా పందుల్లో పరిశీలించగా.. పొట్టలోని బ్యాక్టీరియాలో వైవిధ్యం స్పష్టంగా కనిపించిందట.

టొమాటో తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా!
టొమాటో తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా!

By

Published : Nov 20, 2022, 5:41 PM IST

Health Benefits Of Eating Tomato: ఇందుకోసం వీళ్లు ఆ జంతువుల్ని రెండు విభాగాలుగా చేశారట. అయితే పీచు, చక్కెర, ప్రొటీన్‌, కొవ్వులు, క్యాలరీలు.. అన్నీ ఒకే రకంగా ఉన్న ఆహారాన్ని రెండు విభాగాల్లోని వాటికీ ఇచ్చారట. ఇలా కొన్నాళ్లు చేశాక వాటి మల పరీక్ష ద్వారా రెండింటి పొట్టలోని బ్యాక్టీరియా ఒకేలా ఉందని నిర్ధరించుకున్నారట. ఆ తరవాత ఒక వర్గంలోని వాటికి మాత్రం టొమాటోలు ఎక్కువగా ఉన్న ఆహారాన్నీ మరో వర్గానికి మామూలు ఆహారాన్నే ఇచ్చారట.

రెండు వారాల తరవాత మళ్లీ రెండింటి మలాన్ని పరిశీలించినప్పుడు టొమాటో ఎక్కువగా తీసుకున్న పందుల్లోని మైక్రోబయోమ్‌లో వైవిధ్యం ఎక్కువగా కనిపించిందట. అందులో బ్యాక్టీరియోడొటా అనే బ్యాక్టీరియా శాతం ఎక్కువగా ఉండటం వల్ల వాటి ఆరోగ్యం మెరుగైనట్లూ గుర్తించారు. అంతేకాదు, ఆహారంలో భాగంగా టొమాటోల్ని ఎక్కువగా తినేవాళ్లలో హృద్రోగాలూ క్యాన్సర్ల శాతం కూడా తగ్గుతున్నట్లు తేలింది. అయితే టొమాటోలకీ పొట్టలోని బ్యాక్టీరియాకీ ఉన్న సంబంధం ఏమిటనేది మాత్రం శాస్త్రవేత్తలకి సైతం ఇంకా అంతుబట్టలేదట.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details