కొంతమంది మగవారికి సిఫిలిస్, గనేరియా లాంటి సుఖవ్యాధులు (sexually transmitted diseases) వస్తుంటాయి. వాటి కోసం పలు రకాల మందులు వాడుతూ ఉంటారు. కౌమరంలో ఉన్న అమ్మాయిలతో రతిలో పాల్గొంటే వారికి ఉన్న సుఖవ్యాధులు పోతాయని చాలా కాలంగా కొందరు విశ్వసిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని అంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల మరొకరికి వ్యాధిని అంటించినట్టేనని చెబుతున్నారు.
ఇదీ ప్రశ్న: కౌమరంలో ఉన్న అమ్మాయిలతో సెక్స్ చేస్తే- అంతకుముందు వచ్చిన సుఖవ్యాధులు లేకుండా పోతాయా?
సమాధానం:సుఖవ్యాధులు ఉన్న పురుషులు ఇంతవరకు సెక్స్‌లో పాల్గొనని అమ్మాయిలతో శృంగారంలో పాల్గొంటే.. అవన్నీ పోతాయనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. అది అపోహ మాత్రమే. నిజం కాదు. వారికి వ్యాధులు పోవడం కాదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వాటిని అమ్మాయికి కూడా అంటిస్తారు. అలా చేయడం వల్ల అనవసరంగా ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్లు అవుతుంది.