Diabetes Control Tips In Telugu :చక్కెర వ్యాధి ఒకసారి వస్తే.. అది దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎంత ఎక్కువ కాలం నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతుంటే అంత ఎక్కువగా సమస్యల ముప్పు పెరుగుతుంటుంది. అందుకే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
How To Control Diabetes :మధుమేహం ఉన్నవారిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం రెండు రకాలు: టైప్-1, టైప్-2. ఎక్కువ మందికి టైప్-2 మధుమేహం వస్తుంది. టైప్-1 వంశపారంపర్యంగా వస్తుంది. టైప్-2 మధుమేహం అనేది అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, అధిక బరువు సమస్య వల్ల వస్తుంది. మధుమేహాన్ని నియంత్రించాలంటే.. కచ్చితంగా డాక్టర్ సలహాతో ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
Diabetes Effects :మధుమేహం అధికంగా ఉండేవారిలో.. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, అధికంగా దాహం వేయడం, బాగా బరువు తగ్గిపోవడం, అరికాళ్లలో మంట ఉండటం, చూపు మందగించడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. అందుకే డయాబెటిస్తో బాధపడేవారు బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యం. బరువు తగ్గడం వల్ల డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావచ్చు.
పరీక్షలు చేయించుకోవాలి!
Diabetes Test Name :"షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించడం మంచిది. ఇప్పటికే డయాబెటిస్తో బాధపడుతున్నట్లయితే దాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఊబకాయం ఉందా? కుటుంబంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా షుగర్ ఉందా? అలాగే రక్తపోటుతో బాధపడుతున్నారా? ధూమపానం లాంటి అలవాట్లు ఉన్నాయా అనేది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఏడాదికి ఒకసారి కచ్చితంగా డయాబెటిస్ టెస్టులు చేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినంతగా ఉన్నాయా? లేదా? అనేది టెస్టుల్లో తేలుతుంది" అని ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్, డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి తెలిపారు.
Diabetes In Pregnant Women : "స్త్రీలలో ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. టెస్టుల్లో షుగర్ వ్యాధి గనుక లేదని తేలితే, మన సాధారణ జీవనశైలిని అవలంభించవచ్చు. ఒకవేళ చక్కెర వ్యాధి ఉన్నట్లయితే.. దానికి సంబంధించిన మందులు వాడుతూ.. జీవనశైలిలో సరైన మార్పులు చేసుకోవాలి. ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉంటే దాన్ని డయాబెటిస్ వ్యాధిగా మారకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకోసం డాక్టర్స్ సలహాలతో సరైన మందులు వాడుతూ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి" అని డాక్టర్ రవిశంకర్ సూచించారు.