మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం అవసరం. ఈ ఆహారం విభిన్న రూపాల్లో లభిస్తుంది. పండ్లు, కాయలు, గింజలు మొదలయినవి. వీటిలో చాలా వాటిని నేరుగా లోపలికి తీసుకోవడం వీలు కాదు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా, మొత్తటి గుజ్జుగా చేసి మాత్రమే తింటుంటాం. ఇలా ఆహారాన్ని మెత్తగా చేసేందుకు దంతాలు ఉపయోగపడతాయి. అప్పుడు ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణమై శరీరానికి కావల్సిన బలాన్నిస్తుంది. మరి అటువంటి దంతాల్ని శుభ్రంగా, బలంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే తిన్న తర్వాత నోటిని, దంతాలను శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే దంతాల మధ్య గల ఖాళీలలో ఇరుక్కుపోయి అక్కడే కుళ్లి బాక్టీరియా చేరడానికి అవకాశం ఉంటుంది. దీంతో దంత సమస్యలు వస్తాయి. మరి అలాంటి దంత సమస్యల(Dental Problems)ను చిన్నపాటి చిట్కాలతో ఎలా తొలగించాలో చూద్దాం.
దంత సమస్యలు వేధిస్తున్నాయా?.. ఈ చిట్కా పాటించండి! - దంత సమస్యలు నివారణ
ఆహారం జీర్ణం కావడంలో దంతాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇలాంటి దంతాలకు ఏదైనా సమస్య వస్తే తల్లడిల్లిపోతాం. మరి అలాంటి దంత సమస్యలు(Dental Problems) రాకుండా ఉండేందుకు చిన్న చిట్కా పాటిద్దామా!.
దంత సమస్యలు
చిట్కా
ముందుగా ఒక బౌల్గా నిమ్మరసం తీసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు కలపాలి. దీనికి కాస్త తేనే కలుపుకొన్ని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలకు పట్టించి తోమినట్లయితే సమస్యలు తగ్గుతాయి.