తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వింటర్​లో కర్లీ హెయిర్ సంరక్షణ - ఇలా చేస్తేనే స్టైల్​గా ఉంటుంది!

Winter Hair Care Tips : కర్లీ హెయిర్ ఉండాలనేది చాలా మంది అమ్మాయిల కల. కానీ.. ఈ హెయిర్ సంరక్షణ కొంత కష్టమైనది. ముఖ్యంగా చలికాలంలో జుట్టు ఊడిపోవడం, చివర్లు చిట్లడం లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారి కోసం కొన్ని సూపర్ టిప్స్ తీసుకొచ్చాం. అవేంటో ఇక్కడ చూద్దాం.

Curly Hair
Curly Hair

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 10:20 AM IST

Curly Hair Tips for Winter : మనం అందంగా కనిపించడంలో జుట్టుదీ కీలకపాత్రే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది ముఖ్యంగా మహిళలు.. ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడుతుంటారు. అయితే.. వాతావరణంలోని పలు మార్పుల వల్ల హెయిర్​పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక చలికాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ చలిగాలులకు సాధారణ జుట్టే పొడిగా మారుతుంది. సాధారణ రోజుల్లోనే డ్రైగా అనిపించే కర్లీ హెయిర్(Hair Care).. వింటర్​లో మరింత పొడిబారిపోతుంది. ఫలితంగా చుండ్రు, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బాగా ఊడిపోవడం.. వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మరి, ఈ కాలంలో వాటన్నింటి నుంచి దూరంగా ఉంటూ మీ అందాన్ని పెంచే రింగుల జుట్టును కాపాడుకోవడానికి సౌందర్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పట్టుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.

  • చలి కాలంలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.
  • వాతావరణం కూల్​గా ఉన్నప్పుడు సాధారణంగా నీళ్లు తాగాలనిపించదు. దాంతో తెలియకుండానే డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా చర్మమే కాదు.. జుట్టూ తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. అందుకే కర్లీ హెయిర్​ ఉన్నవారు తమ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ తగినంత మొత్తంలో నీళ్లు తాగాలి.
  • రోజులో కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. తద్వారా ఒత్తిడి, ఆందోళనలు దూరమై.. ప్రశాంతత దరిచేరుతుంది.
  • అప్పుడప్పుడూ కొన్ని చుక్కల హెయిర్ సీరమ్ రాసుకోవడం వల్ల కూడా.. చల్లటి వాతావరణం నుంచి కర్లీ హెయిర్‌ను కాపాడుకోవచ్చు.
  • రింగుల జుట్టు ఉన్న వారు చివర్లు చిట్లే సమస్యతో బాధపడుతుంటారు. దానివల్ల వెంట్రుకలు నిర్జీవంగా కనిపిస్తాయి. కాబట్టి ప్రతి మూడు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరిస్తూ ఉండాలి.

జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా? - అయితే ఇది ట్రై చేశారంటే మీ జుట్టు అస్సలు ఊడదు!

  • హెయిర్​కు తేమను అందించడంలో కలబంద చక్కగా పని చేస్తుంది. కాబట్టి వారానికి రెండుసార్లు కలబంద గుజ్జును జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • జుట్టు తేమను కోల్పోకుండా చేయడంలో తేనె కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. కండిషనర్లు, క్లెన్సర్‌లలో కాస్త తేనె కలుపుకొని అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.
  • జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నూనెల పాత్ర కూడా కీలకమే. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి అత్యవసర నూనెలతో తరచూ జుట్టుకు మసాజ్ చేయాలి.
  • అయితే వింటర్​లో కర్లీ హెయిర్‌ను కాపాడుకోవడానికి గోరువెచ్చటి నూనెతో మసాజ్ చేయడం మంచిది.
  • తలస్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టుకు చక్కటి పోషణ లభిస్తుంది.
  • ఉపయోగించే నూనె ఏదైనా సరే.. దాన్ని అప్లై చేసుకునే ముందు కాస్త వేడి చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ABOUT THE AUTHOR

...view details