Cold Water Bath in Winter in Telugu:శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో చాలామంది ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. బాత్ రూంలోకి వెళ్లి ట్యాప్ తిప్పాలన్నా, చల్లటి నీటిని తాకాలన్నా జంకుతారు. ఉదయం వేళ చల్లటి నీటిని తాకగానే బాడీలో వెబ్రేషన్స్ వచ్చేస్తాయి. అందుకే.. చాలామంది వేడినీటికే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే.. కొందరు కావాలనే చన్నీటి స్నానం చేస్తుంటారు. అయితే.. ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల.. వాతావరణ మార్పులు చేటు చేసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చన్నీటి స్నానం చేయడం వల్ల.. కొందరిలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని.. దానివల్ల ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశం ఉందని.. ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పాదాలు పగులుతున్నాయా? - ఈ టిప్స్‌తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!
Effects of Cold Water Bath in Winter: ఒక వయసు దాటిన వారు.. చలి కాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల గుండెపోటు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరణానికి కూడా దారితీయవచ్చట. కాబట్టి.. ఇబ్బంది పడుతూ చన్నీటితో స్నానం చేయకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదంటున్నారు. ఈ కాలంలో శరీరంపై చల్లటి నీరు పడడతో.. శరీరంలోని రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయట. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల హార్ట్‌బీట్ అసాధారణంగా పెరుగుతుందనీ.. ఇలాంటి సమయంలో గుండెలో బ్లాక్ ఏర్పడి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.