కామ కోరికలు ఎక్కువైనప్పుడు వయసులో ఉన్నవారికి శృంగారపరమైన కలలు రావడం చాలా సహజంగా జరుగుతుంది. మనకు తెలియనివారు ఎవరో మనతో శృంగారంలో పాల్గొనట్లుగా.. వారు మనల్ని అణువణువూ అనుభవిస్తున్నట్లు కలలు వస్తుంటాయి. ఆ సమయంలో పురుషులు నిద్రలోనే వీర్య స్కలనం చేస్తుంటారు. అసలు స్వప్న స్కలనాలు ఎంతవరకు మంచివి? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
స్వప్న స్కలనానికి కారణమిదే!
మనిషి శరీరం మెదడు నియంత్రణలో ఉంటుంది. మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. శరీర అవయవాలకు సంకేతాలు పంపిస్తుంది. వాటి ఆధారంగానే అవయవాలు పని చేస్తాయి. అలాగే స్కలనం అవ్వాలన్నా.. మెదడు నుంచి శృంగార పరమైన సంకేతాలు రావాలి. అయితే అవి ఎప్పుడైనా రావచ్చు.. మనిషి మేల్కొన్నప్పుడు కావచ్చు లేదా నిద్రపోతున్నప్పుడు కావచ్చు.
సాధారణ సమయంలో యుక్త వయసులో ఉన్న వ్యక్తి అందమైన అమ్మాయిని చూస్తే.. పురుషుల్లో ఓ రకమైన అలజడి ఏర్పడుతుంది. కొందరిలో అప్రయత్నంగానే స్కలనం జరిగిపోతుంటుంది. ఇదంతా మెదడు నుంచి వచ్చే సంకేతాల వల్లే జరుగుతుంది. నిద్రపోతున్నా మెదడు యాక్టివ్గా ఉంటుంది. శృంగార కోరికలు ఉంటాయి. దీనివల్ల నిద్రలో కూడా సెక్స్ ఆలోచనలు వస్తుంటాయి. నిద్రపోతున్నప్పుడు సెక్స్ పరమైన ఆలోచనలు, ఊహలు వచ్చినప్పుడు మెదడు సంకేతాలతో శుక్రకోశాలు ఉత్తేజమై.. వీర్యం బయటకువస్తుంది. అయితే యుక్తవయసులో ఉన్నప్పుడు కొంతమందికి హస్తప్రయోగం అలవాటవుతుంది. దీన్ని వల్ల తృప్తి చెందినవారికి స్వప్నస్కలనం చాలా తక్కువగా జరుగుతుంది.