కలయిక తర్వాత యోనిలోకి నిమ్మకాయ రసం పిండితే గర్భం రాకుండా ఉంటుందనేది కేవలం అపోహే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయ రసం వల్ల ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ కలిగి పుండ్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అది కాస్త గర్భాశయానికి చేరితే మరింత ప్రమాదమన్నారు. గర్భం రాకుండా ఉండాలంటే కండోమ్ వాడాలే తప్ప ఇటువంటి పద్ధతులు అనుసరించకూడదని చెప్పుకొచ్చారు.
నిమ్మకాయ రసం గర్భం రాకుండా నిరోధిస్తుందా? - ప్రెగ్నెన్సీ పై మహిళల్లో అపోహలు
గర్భం రాకుండా శృంగారాన్ని ఆస్వాదించాలనుకునేవారు కండోమ్ను వాడతారు. అయితే కొంతమంది మహిళలు తమకు కడుపు రాకుండా ఉండేందుకు యోనిలో నిమ్మకాయను పిండుతుంటారు. కలయిక పూర్తయ్యాక నిమ్మకాయ రసం పూసుకుంటే నిజంగానే గర్భం రాదా? నిపుణుల మాటేంటి?
నిమ్మకాయ రసం గర్భం రాకుండా నిరోధిస్తుందా?
జిల్లేడు పాలు పోయడం, నిమ్మకాయ పిండటం, సున్నపు నీళ్లు పోయడం, సబ్బునీళ్లు పోయడం ఇటువంటివి అన్నీ మొరటు పద్ధతులని.. పూర్తి అశాస్త్రీయమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఏ వయసులో శృంగారంపై ఆసక్తి తగ్గుతుందో తెలుసా?
Last Updated : Nov 14, 2021, 11:52 AM IST