తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకోవచ్చా?

బరువు ఎక్కువగా ఉండటం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న(weight loss technique) సమస్య. బరువును(obesity causes) తగ్గించడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇంతకీ ఈ విషయంలో డాక్టర్లు ఇస్తున్న సలహా ఏంటంటే?

By

Published : Oct 1, 2021, 7:21 AM IST

weight loss techniques
బేరియాట్రిక్​ సర్జరీ రకాలు

ప్రస్తుత రోజుల్లో చాలామందిని స్థూలకాయం(obesity causes)సమస్య వేధిస్తోంది. శరీర బరువును(weight loss technique) తగ్గించడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. వ్యాయామం, డైట్​ పాటించడం చేస్తుంటారు. కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు సర్జరీలు(Bariatric Surgery side effects) కూడా ప్రయత్నిస్తుంటారు. అయితే సర్జరీ వల్ల బరువు తగ్గొచ్చా?

ప్ర. నా వయసు 40 ఏళ్లు. ఎత్తు 5.9 అంగుళాలు. ప్రస్తుతం 95 కేజీల బరువు ఉన్నాను. డైట్ పాటించినప్పటికీ బరువు ఏ మాత్రం తగ్గలేకపోతున్నాను. ఇందుకు బేరియాట్రిక్​ సర్జరీ(Bariatric Surgery side effects)చేయించుకోవచ్చా? దీనికారణంగా ఏమైనా ఇతర సమస్యలు వస్తాయా?

జ. సర్జరీ అవసరమా? లేదా? అనేది బీఎమ్​ఐ(బాడీ మాస్​ ఇండెక్స్​)పై ఆధారపడి ఉంటుంది. బీఎమ్​ఐ 32 కన్నా ఎక్కువగా ఉండి, బరువు కారణంగా ఇతర సమస్యలు ఉన్నట్లయితే.. సర్జరీకి అర్హులు అవుతారు. మీ బీఎమ్​ఐ 31.5 ఉన్నందున డైట్​తోనే బరువును తగ్గించుకోవడం మంచిది. బరువుతో పాటు డయాబెటిస్​, గురక, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటే సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది.

మీ వయసుకు ఇంకా డైట్​తోనే ప్రయత్నించవచ్చు. మంచి ఆహారం, వ్యాయామంతోనే బరువును నియంత్రించవచ్చు. ఇందుకోసం డైటీషన్​ను సంప్రదించండి. సరైన విధంగా డైట్​ పాటింటినప్పుడే బరువును తగ్గించవచ్చు.

ఇదీ చదవండి:Childhood Obesity: చిన్న పిల్లల్లో స్థూలకాయం- కారణాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details