Copper Vessels Drinking Water Disadvantages : మనం ఆరోగ్యం ఉండడానికి మంచి ఆహారంతో పాటు నీరు కూడా చాలా అవసరం. అయితే ప్రస్తుతం చాలా మంది రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుని రాగి బాటిళ్లు, బిందెలలో నీళ్లు తాగుతున్నారు. ఇక కొందరైతే ఆఫీసులు, హాస్పిటల్స్, కాలేజీలకు కాపర్ బాటిల్స్ తీసుకెళ్తున్నారు. అయితే మీకు కూడా రాగి పాత్ర(Copper Bottles)లో నీళ్లు తాగే అలవాటు ఉంటే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కాపర్ పాత్రలను ఎక్కువగా యూజ్ చేయటం వల్ల అవి పలు ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ రాగి పాత్రలోని వాటర్ తాగితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మానవ శరీరానికి అవసరమైన ట్రేస్ ఎలిమెంట్ రాగి.. వివిధ శారీరక ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బంధన కణజాలాల నిర్మాణం, శక్తి ఉత్పత్తి, ఎంజైమ్‌ల పనితీరులో పాల్గొంటుంది. అయితే ఇక్కడ రాగి తక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. అలాకాకుండా మీరు అధికం మొత్తంలో రాగి తీసుకుంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా రాగి పాత్రలలో నిల్వ ఉంచిన నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కాపర్ టాక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫలితంగా అది శరీరంలో జీవక్రియకు బాధ్యత వహించే కాలేయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. రాగి పాత్రలు లేదా బాటిల్స్ ద్వారా తాగే నీటి వినియోగం ద్వారా అది ప్రభావితమవుతుంది. ఎందుకంటే.. రాగి పాత్రలు యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటాయి. నీటిని శుద్ధి చేయడంలో ఇవి సహాయపడుతాయి. అయినప్పటికీ, రాగి అధికమొత్తంలో బాడీలో చేరితే ఆ కారణంగా కాపర్ టాక్సిసిటీ సంభవించి.. అది కాలేయ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.