తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బరువు తగ్గడానికి "వాటర్ థెరపీ" - జస్ట్ నీళ్లు తాగితే చాలు కొండలాంటి పొట్ట వెన్నలా కరిగిపోతుంది! - Health Benefits of Japanese Water Therapy

Best Weight Loss Method : బరువు తగ్గడానికి జనం ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. ఎన్నో రకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. అయితే.. "వాటర్ థెరపీ" గురించి మీకు తెలుసా? కేవలం నీళ్లు తాగి వెయిట్​ లాస్​ కావొచ్చు! మరి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Weight Loss Treatment
Weight Loss Treatment

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 6:30 PM IST

Best Weight Loss Treatment in Telugu :ఈ ఆధునిక సమాజంలో అందరూ జపిస్తోన్న మంత్రం 'బరువు తగ్గాలి.. నా జూగ్గా మారాలి'. అందుకోసం ఎన్నో రకాల డైట్స్, వర్కౌట్స్​ ఫాలో అవుతున్నారు. అయితే.. కేవలం వాటర్ తాగడం ద్వారా బరువు తగ్గే థెరపీ గురించి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ థెరపీ పేరు.. "జపనీస్ వాటర్ థెరపీ(Japanese Water Therapy)". జపాన్​ ప్రజలు బరువు నియంత్రించుకోవడానికి ఈ థెరపీని.. పూర్వకాలం నుంచీ ఫాలో అవుతున్నారట. గోరువెచ్చని నీటితోనే ఈ థెరపీని పాటిస్తారు. దీన్ని ఎలా ఫాలోకావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా చేయాలి..

  • ఈ పద్ధతిని పాటించేవారు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నాలుగైదు గ్లాసుల గోరువెచ్చటి నీరు తాగాలి.
  • అదే విధంగా బ్రేక్ ఫాస్ట్ చేయడానికి 45 నిమిషాల ముందు కూడా వాటర్ తీసుకోవాలి.
  • ఇక భోజనానికి 15 నిమిషాల ముందు వాటర్ తాగాలి.
  • చిరుతిండి కావొచ్చు.. మరేదైనా కావొచ్చు.. ఒకసారి తిన్న తర్వాత మళ్లీ రెండు గంటల వరకూ ఏదీ తినకూడదు.
  • వయసు పైబడిన వారు ఈ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా ఒక గ్లాసు నీటితో ఈ వాటర్ థెరపీని ప్రారంభించాలి.
  • ఒకవేళ మీరు వరుసగా నాలుగైదు గ్లాసుల నీరు తాగలేకపోతే.. ప్రతి గ్లాసుకూ మధ్య కొంత సమయం తీసుకొని తాగాలి.
  • అదేవిధంగా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి.
  • రాత్రి నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించాలి.
  • ఇలా చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయట.
  • ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. నిలబడి తినడం, తాగడం వంటివి అస్సలే చేయకూడదు.

మహిళల్లో అధిక బరువా? కారణం తిండి కాకపోవచ్చు!

జపనీస్ వాటర్ థెరపీ ద్వారా పొందే ప్రయోజనాలు..

  • ఓ అధ్యయనం ప్రకారం.. ఈ పద్ధతి ద్వారా పగలు ఎక్కువగా నీరు తాగడం వల్ల ఆకలిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.
  • ఈ థెరపీ స్వీట్ డ్రింక్స్ తాగే అలవాటును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
  • ముఖ్యంగా బరువు తగ్గడానికి బాడీలోని క్యాలరీలను తగ్గిస్తుంది.
  • మొత్తం జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడానికి, గట్ ఆరోగ్యాన్ని మెరుగపరచడానికి ఈ థెరపీ చాలా ఉపయోగపడుతుంది.
  • ఇక మలబద్దకాన్ని నివారించడంతో పాటు టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, హై బీపీ సమస్యను నియంత్రిస్తుంది.
  • ఎక్కువ వాటర్ తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాలు క్లీన్ అవుతాయి.
  • అయితే.. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఓవర్​హైడ్రేషన్ సమస్య రావొచ్చు. కాబట్టి ప్రతి గంటకు వారి కెపాసిటీని బట్టి వాటర్​ తీసుకోవాలి.

ఈ థెరపీ ద్వారా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కచ్చితంగా గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి. ఎందుకంటే చన్నీళ్లు జీర్ణాశయం, పేగుల్లో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించలేవు. కానీ, వేడి నీళ్లు ఆ పని చేస్తాయి. అందుకే ఉదయాన్నే గోరు వెచ్చని నీటిని తాగడాన్ని జపనీస్‌ ఎక్కువగా ఇష్టపడతారట. ఫలితంగా కొవ్వులు కరిగి బరువు తగ్గుతారు.

Weight Loss Tips : అధిక బరువు సమస్యా? టైమ్​కు భోజనం చేయకపోతే ఇంకా నష్టం!

అధిక బరువుతో ఇబ్బందులా.. ఇలా చేయండి

బరువు తగ్గాలంటే కిచెన్‌లో ఈ మార్పులు తప్పనిసరి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details