తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ ఫేస్ గ్లాస్​ స్కిన్‌లా మెరవాలా?- ఈ రెండు ఐటెమ్స్​ ఉంటే చాలు, గ్లో అదిరిపోద్ది! - బియ్యం పిండి ఫేస్​ప్యాక్​

Best Packs For Glowing Face: ఫేస్‌పై మచ్చలు, మొటిమలు లేకుండా ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కాలుష్యం, యూవీ కిరణాలు, ఆహార అలవాట్లు, లైఫ్‌స్టైల్‌ మార్పుల కారణంగా అనేక సౌందర్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్‌ పెట్టి కాంతివంతమైన చర్మం పొందడానికి కేవలం రెండు పదార్థాలు చాలు. ఆ పదార్థాలు నిత్యం వంటింట్లో దర్శనమిస్తాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Best Packs For Glowing Face
Best Packs For Glowing Face

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 11:10 AM IST

Best Packs For Glowing Face: అందంగా ఉండాలని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరు తాము అందంగా ఉండాలని భావిస్తారు. అయితే కాలుష్యం, ఒత్తిడి కారణంగా పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా.. ముఖం గ్లో కూడా తగ్గిపోతుంది. దీంతో ముఖం కాంతి పోయి.. చర్మసమస్యలు తలెత్తుతాయి. అయితే.. అందంగా ఉండడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీమ్లు ఉపయోగిస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి, అందంగా మారెందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాటి ప్రభావం చాలా తక్కువ సమయం వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు మెరిసే చర్మాన్ని పొందడానికి కొన్ని సులభమైన చిట్కాలను కేవలం ఇంట్లో లభించే రెండు పదార్థాలతో పొందొచ్చంటే నమ్ముతారా..? కానీ నమ్మి తీరాలి. ఆ రెండు పదార్థాలు మరేమిటో కాదు బియ్యం పిండి, పాలు. అవును.. కేవలం ఈ రెండింటిని వినియోగించి..ఫేస్​ప్యాక్​ వేసుకుంటే.. ఫేస్​లో గ్లో వస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా ? ఈ హోమ్​మేడ్​ టిప్స్​తో రిలీఫ్​ పొందండి!

బియ్యం పిండి:ఈ రోజుల్లో మచ్చలేని గ్లాస్​ స్కిన్ కోసం.. బియ్యం పిండితో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు ట్రెండింగ్​లో ఉన్నాయి. ఇది పాత మచ్చలను పోగొట్టడమే కాకుండా పిగ్మెంటేషన్, సన్ బర్న్ మార్కులను కూడా తగ్గిస్తుంది. కొరియన్ స్కిన్ కేర్‌లో రైస్, రైస్ ఫ్లోర్ చాలా ముఖ్యం. ఈ రైస్‌ పాడర్‌ని సరైన విధంగా రాస్తే స్కిన్ మెరుస్తుంది. బియ్యం పిండిలో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంలో తేమని అలానే ఉంచుతుంది. బియ్యం పిండిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్‌ని దూరం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల డ్యామేజ్‌ని దూరం చేస్తాయి. ఇది ముడతలని తగ్గిస్తుంది.

తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!

పాలు:ఇవి ఆరోగ్యానికి మాత్రమే మంచిదని చాలా మంది అనుకుంటారు. అయితే, పాలని వాడడం వల్ల అందం కూడా మెరుగవుతుంది. పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. పాలు మంచి హైడ్రేటర్. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. చర్మం పొడిబారినట్లు అనిపిస్తే ముఖానికి పాలు రాయాలి. పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు, వయసు తాలుకూ మచ్చల్ని తగ్గిస్తాయి. పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ సూర్యుని నుంచి వచ్చే హానికర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. మొటిమలు వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. మరి ఈ మాస్క్​ ఎలా తయారు చేయాలి..?

కండరాల నొప్పులు బాధిస్తున్నాయా? ఉల్లిపొట్టుతో చెక్​ పెట్టండి!

మాస్క్​ ఎలా తయారు చేయాలంటే:

  • ముందుగా గ్లాసు పాలు తీసుకోండి. ఫ్యాట్ మిల్క్ అయితే మంచిది.
  • ఆ తర్వాత ఓ గిన్నెలో మూడు టీ స్పూన్ల బియ్యం పిండి వేసి సరిపడా పాలు వేసి స్టౌ మీద పెట్టాలి.
  • ఇది చక్కగా క్రీమ్ అయ్యే వరకూ అలానే కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోండి. పూర్తిగా క్రీమ్​ లాగా అయిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయాలి.
  • ఇప్పుడు ముఖాన్ని క్లీన్ చేసి రెడీ చేసిన క్రీమ్​ను ముఖానికి అప్లై చేయాలి.
  • 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గి చర్మాన్ని గ్లాస్​ స్కిన్ ఉండేలా చేస్తుంది.

గమనిక: మీకు ఏదైనా అలర్జీ ఉంటే ముందుగా స్కిన్ స్పెషలిస్ట్‌ని కలిసి సలహా అడగాలి. అదే విధంగా మీరు ప్యాచ్ టెస్ట్ చేశాకే ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది.

గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details