తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆహార నియమాల్లో మార్పుతో 'మొటిమల' సమస్యకు చెక్​!

Health Tips for Skin: తీసుకునే ఆహారం పైనే మన శరీరాకృతి, చర్మ ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని చెబుతారు నిపుణులు. ఇది అక్షరాలా నిజం. ముఖ్యంగా ఈ ప్రభావం ముఖంపైన ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో సందేహమే లేదు. మొటిమలు, ముడతలు పడటం, వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్​ పెట్టి చర్మం నిగనిగ మెరవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Health Tips for Skin
Health Tips for Skin

By

Published : Mar 7, 2022, 7:14 AM IST

Health Tips for Skin: మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. శరీరం లోపలి భాగాలు ఎలా ఉన్నా.. ప్రతిఒక్కరి దృష్టి చర్మం, దాని సౌందర్యం మీదే ఉంటుంది. తాము అందంగా కనిపించాలని.. చర్మం నిగనిగ మెరవాలని అందరూ భావిస్తారు. దీని కోసం కొందరు రకరకాల క్రిములు రాస్తుంటారు. మరికొందరు ఆహార అలవాట్లు ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకుని ప్రయత్నం చేస్తారు. అయితే చర్మ కాంతికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.

  • ఆహారం అలవాట్లు, నియమాలు చర్మం రంగుపై ప్రభావం చూపుతాయి. అయితే చర్మం రంగు పూర్తిగా మారదు. కానీ హైడ్రేషన్​, పిగ్మెంటేషన్​, ఎండలో తిరిగినప్పుడు చర్మం రంగు మారడం, చర్మం గ్లో మెరుగుపడే అవకాశం ఉంటుంది.
  • ఆహార నియామాలు మార్చుకోవడం వల్ల చర్మంపై మొటిమలు తగ్గించుకోవచ్చు అంటున్నారు.
  • రోజువారీ ఆహారంలో వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం చర్మానికి మంచిది. వాటిల్లో ఉండే విటమిన్స్​, యాంటీ ఆక్సిడెంట్స్​ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుతాయి. ముఖ్యంగా టమోటా, క్యారెట్​, క్యాప్సికమ్​, బెర్రీస్​, స్ట్రా బెర్రీస్​ వంటివి. వీటితో పాటు ఆపిల్​, ఆరెంజ్ వంటి పండ్లు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
  • ఐస్​క్రీమ్స్​, ఆయిల్స్​ ఫుడ్స్​కు దూరంగా ఉండటం మంచిది.

చర్మ సౌందర్యానికి మరిన్ని చిట్కాలు

  • నీళ్లు...చర్మం ముడతలు పడటానికి కారణాల్లో నీళ్లు తాగకపోడం కూడా ఒకటి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడదు. ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.
  • విటమిన్‌-ఇ..దీని లోపం వల్ల కూడా ముడతలు వస్తాయి. అందుకే ఈ విటమిన్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి.
  • విటమిన్‌-సీ...జామ, ఉసిరి, సంత్రా... తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి.
  • కొబ్బరి... చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • సోయాబీన్‌, మొలకలు... వీటితో కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

మొటిమలు రాకుండా చిట్కాలు

  • 'విటమిన్ ఇ' ఎక్కువగా ఉండే నట్స్, గుడ్లు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకుంటే మొటిమల సమస్య బాధించదు.
  • జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా మొటిమల సమస్య ఎక్కువవుతుంది.
  • వేళకు నిద్రపోవడం, కనీస వ్యాయామం వల్ల మొటిమల సమస్య దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తలలో చుండ్రు లేకుండా చూసుకోవడం వంటివి కూడా మొటిమలను తగ్గించుకునే ప్రత్యామ్నాయ మార్గాలే.

ఇదీ చూడండి:గర్భిణులకు హైబీపీ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ABOUT THE AUTHOR

...view details