తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జుట్టు కుదుళ్లు బలంగా మారాలా?.. ఇవి తినేయండి! - జట్టు పెరుగుదలకు మంచి ఆహారం

మనం తీసుకునే ఆహారం మన జుట్టు, చర్మం పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండాలన్నా, జుట్టు కుదుళ్లు బలంగా మారాలన్నా పోషకాలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాల్సిందే. అవేంటో తెలుసుకోండి మరి..

best food for hair growth
మంచి జుట్టు కోసం తినాల్సిన ఆహార పదార్ధాలు

By

Published : Jun 13, 2022, 6:54 AM IST

బట్టతల.. ఈ మాటే నేటి యువతరం పాలిట ఓ పిడుగుపాటు. గతి తప్పిన ఆహారం.. శృతి మించిన ఒత్తిళ్లు.. అంతులేని కాలుష్యం.. ఇవన్నీ కలిసి మన తలపై ఉన్న వెంట్రుకల కుదుళ్లను పెకిలిస్తున్నాయి. పాతికేళ్ల వయసుకే బట్టతలను తెచ్చిపెడుతున్నాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు. గుడ్లు, పెరుగులో మాంసకృత్తులు, విటమిన్‌-బి5 పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ లభిస్తాయి. అంతేకాదు.. మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం, పలుచబడడం వంటి సమస్యలు తగ్గుతాయి.

.
  • సాల్మన్‌ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. మెరిసేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు పొడిబారకుండా ఎండిపోయి గడ్డిలా మారకుండా చూస్తాయి.
  • దాల్చిన చెక్క రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కుదుళ్లకు పోషణను చేకూరుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్క పొడిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
  • పప్పుల్లోని మాంసకృత్తులు, ఇనుము జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.
  • చిలగడ దుంపలో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మాడుపై తైలగ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో జుట్టు కాంతివంతంగా కనిపిస్తుంది.
  • బాదంలో పీచు, మాంసకృత్తులతో పాటు మాంగనీస్‌, సెలీనియం.. వంటి మూలకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టును మెరిపించడంతో పాటు బలంగా మారుస్తాయి.

ABOUT THE AUTHOR

...view details