కీళ్ల నొప్పులు తగ్గించడంలో మునగాకు ఎంతో ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మునగాకుతో చేసిన ఈ పథ్యాహారాన్ని తింటే కీళ్ల సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. మరి ఆ పథ్యాహారం ఏమిటో దానిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం..
కావాల్సినవి..
మునగాకు, రాగి పిండి, జొన్న పిండి, నువ్వుల నూనె, ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు.
తయారీ విధానం
మొదటగా ఓ గిన్నెలో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత బాగా కడిగిన మునగాకును ఆ మిశ్రమంలో వేసి వేయించుకోవాలి. ఆ మిశ్రమం అంతా ముద్దలా అయ్యేంత వరకు వాటిని వేయించాలి.
ఇప్పుడు సుమారు అరకప్పు రాగి పిండిని తీసుకుని మునగాకు మిశ్రమంలో కలపాలి. ఇందులో జొన్న పిండిని వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో తగినంత ఉప్పును కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి దోశల పిండిలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఓ పెనం మీద నువ్వుల నూనె వేసుకుని చిన్న చిన్న దోశలుగా వేసుకోవాలి.
ఈ దోశలను ఉదయం కానీ, సాయంత్రం కానీ రోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గటానికి మంచి పథ్యాహారంగా ఉపయోగపడుతుంది.
ఇదీ చూడండి :smoking stop tips: పొగ మానటానికి సంయుక్త చికిత్స మేలు