తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మతిమరుపు సమస్యా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

ayurveda for brain health: మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మెదడు. మెదడుకు రక్త సరఫరా, ప్రాణవాయువు సరిగ్గా అందకపోతే మందకొడిగా పనిచేస్తుంది. ఇలా కాకుండా చురుగ్గా పనిచేయడానికి ఆయుర్వేదం అందిస్తున్న కొన్ని సలహాలను, చిట్కాలను చూద్దాం.

ayurvedic tips for brain
మెదడు చురుకుగా పనిచేయాలంటే ఇలా చేయండి

By

Published : Mar 11, 2022, 5:51 PM IST

ayurveda for brain health: మనిషి ఏ పని చేయాలన్నా అందులో మెదడు ముఖ్యభూమిక పోషిస్తుంది. అలాంటి మెదడు చురుకుగా పనిచేయక చాలా మంది మతిమరుపుతో బాధ పడుతుంటారు. అలాంటి వారికోసం మన ఆయుర్వేదం చెబుతున్న కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

  • పాలు ,మజ్జిగ, గోరు వెచ్చటి నీళ్లు
  • కూరగాయల రసం, పళ్ల రసం, చేపలు, జీడిపప్పు
  • ఆలివ్​ నూనె, బెర్రీలు ,బీట్​రూట్
  • తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది.​

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మద్యపానం, ధూమపానం తగ్గించుకోవాలి.
  • చిప్స్​, జంక్​ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు.
  • పజిల్స్​, చదరంగం లాంటి ఆటలు ఆడాలి.

​ఆయుర్వేద చిట్కాలు

  • చిన్న కప్పులో కొంత నీరు, కొన్ని తులసి ఆకులు, యాలకులు వేసి మరిగించుకొవాలి. ఆ వేడి పానియాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలు తాగాలి.
  • వేడి పాలలో బాదం పొడి, యాలకుల పొడి, పటిక బెల్లం కలుపుకొని తాగాలి.
  • రెండు గ్రాముల బ్రాహ్మిచూర్ణం, యష్టిమధు చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని కొంచెం తేనె, నెయ్యి కలుపుకొని ముద్దలాగా చేసి తీసుకోవాలి.
  • రెండు గ్రాముల వసకొమ్ము చూర్ణంలో కొద్దిగా తేనె, నెయ్యి కలిపి తీసుకోవాలి.
  • బ్రాహ్మిబట్టి, సరస్వతి లేహం, సారస్వతారిష్టం, శంకపుష్టి రసాయనం లాంటివి ఉంటాయి. వీటిని వైద్యుల సలహా మేరకు ఆయుర్వేద దుకాణాల్లో తీసుకోవాలి.
  • తగినంత నిద్ర- కనీసం 8 గంటలు పడుకోవాలి.
  • తలకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే మెదుడు చురుకుగా పనిచేస్తుంది.

ఇదీ చదవండి:ఈ ఆయుర్వేద చిట్కాలతో నడుం నొప్పి మాయం!

ABOUT THE AUTHOR

...view details