Aloe Vera For Hair Growth :కాలుష్యం, ఆహారపు అలవాట్లతో చాలా మంది జట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం, జుట్టు పొడిబారడం, దురద, చుండ్రు ఇలా అనేక హెయిర్ ప్రాబ్లమ్స్(Hair Problems)తో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యల నివారణకు జనం ఏదేదో చేస్తుంటారు. కొందరు డైట్ పాటిస్తుంటారు. మరికొందరు ఏవో నూనెలు వాడుతుంటారు. వాటితో పనిలేకుండా అలోవెరాతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు.
అలవెరాను తెలుగులో 'కలబంద'(Aloe Vera) అంటారు. దీనిని చాలా కాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా.. చర్మ రక్షణకు సైతం అలోవెరా బాగా ప్రాచుర్యం పొందింది. మీరు జుట్టు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పడే కలబందను వాడడం మొదలు పెట్టండని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేచురల్ రెమిడీ.. కొన్ని రోజుల్లోనే మీకు బెస్ట్ రిజల్ట్స్ చూపిస్తుందని అంటున్నారు. మరి.. జుట్టు సమస్యల పరిష్కారానికి అలోవెరాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..
- మీరు డ్రై హెయిర్‌తో ఇబ్బందిపడుతుంటే.. తాజా కలబంద జెల్‌ను అప్లై చేయడం ద్వారా బెటర్ రిజల్ట్ పొందవచ్చు. అందుకోసం.. మీరు ముందుగా ఫ్రెష్ కలబందను కట్ చేసి క్లీన్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లో ఉంచి.. కత్తి సహాయంతో దాని పైభాగాన్ని తొలగించాలి.
- అనంతరం ఒక గిన్నె తీసుకొని చెంచా సహాయంతో జెల్‌ను తీయాలి.
- ఇప్పుడు ఆ జెల్‌ను నేరుగా మీ జుట్టు మూలాలకు అప్లై చేయాలి.
- అది మొత్తం జుట్టు మొదళ్లకు పట్టేలా చూసుకోవాలి.
- ఆ విధంగా హెయిర్‌కు పట్టించిన తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచాలి.
- ఆ తర్వాత హెర్బల్ లేదా ఆయుర్వేద షాంపును ఉపయోగించి తలస్నానం చేయాలి.
చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? - ఈ టిప్‌తో మీ జుట్టు నిగనిగలాడిపోద్ది!
- ఆలోవెరాను మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని కొబ్బరినూనెతో కలిపి కూడా జుట్టుకు రాసుకోవచ్చు.
- ఇలా క్రమం తప్పకుండా వారంలో రెండు రోజులు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
- జుట్టు రాలడం, చుండ్రు సమస్య నివారణకూ ఇది మంచి ఔషధం. అలాగే సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
- కంటిన్యూగా అలోవెరాను మీ హెయిర్‌కు అప్లై చేయడం వల్ల మీ జుట్టు బలంగా మారి.. ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
- ఇక కలబందలో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. అది జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- అలాగే మీ తలలో చుండ్రు ఉండి.. జుట్టు మూలాల్లో ఎప్పుడూ దురద వేధిస్తూ ఉంటే.. దాన్ని తగ్గించడంలోనూ అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది.
- అలోవెరా జెల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది.
- కలబంద గుజ్జు అన్ని రకాల వాపులను కూడా తగ్గిస్తుంది.
- ఇది నేచురల్ పదార్థం కావడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.