తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వర్క్​ ఫ్రం హోంలో ఈ ఎక్సర్​సైజ్​లు చేస్తున్నారా? - వర్క్​ ఫ్రం హోం

లాక్​డౌన్​తో వర్క్​ ఫ్రం హోం చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది లాప్​టాప్స్​కు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో అసలు వ్యాయామాలే చేయడం లేదు. కానీ ఇంట్లోనే ఈ మూడు స్ట్రెచ్​లు చేస్తే శరీరం ఎప్పటికప్పుడు యాక్టివ్ అవుతుంది.

3 Desk stretches you can do while working from home
వర్క్​ ఫ్రం హోంలో శరిరాన్ని ఇలా స్ట్రెచ్​ చేసేయండి

By

Published : May 2, 2020, 2:23 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

లాక్​డౌన్​ వల్ల మీరు ఇంటి నుంచే పనిచేస్తున్నారా? గంటలు గంటలు కంప్యూటర్​ ముందే కుర్చుండిపోతున్నారా? అయితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? అందుకే ఇలాంటి చిన్న స్ట్రెచింగ్స్​ చేస్తే సరిపోతుందని అంటున్నారు ఫిట్​నెస్​ ట్రైనర్​ జునైద్​ అఖ్తర్​.

పెక్టోరల్​ స్ట్రెచ్​...

ల్యాప్​టాప్​​ స్క్రీన్స్​ నుంచి ఎప్పటికప్పుడు విరామాలు తీసుకోవడం ఎంతో అవసరం. మీరు కూర్చున్న తీరు మీకు తెలుస్తుంది. ఈ విరామాల్లో... చేతులు రెండింటినీ లాక్​ చేసి.. వెనుకవైపునకు లాగండి. అప్పుడు భుజాలపై కొంతమేర ఒత్తిడి పడుతుంది.

దీని వల్ల కండరాలు బలపడతాయి. నిటారుగా కూర్చోగలుగుతారు.

కండరాలు బలంగా అవ్వాలంటే ఇలా

ట్రెపీజియస్​ నెక్​ స్ట్రెచ్​...

ల్యాప్​టాప్​కే అతుక్కుపోవడం వల్ల మెడ నొప్పి వస్తోందా? అయితే ఎప్పటికప్పుడు ఈ ట్రెపీజియస్​ నెక్​ స్ట్రెచ్​ చేయండి.

ట్రెపీజియస్​ నెక్​ స్ట్రెచ్​

ఎడమ చేతితో కుర్చీ కింద భాగాన్ని పట్టుకోండి. మీ కుడి చేతిని ఎడమ చెవివైపు తీసుకురండి. మీ తలను కొద్దిగా కుడి భుజంవైపు వాల్చండి. ఈ స్ట్రెచ్​లో మీ కుడి చెవిని భుజానికి ఎంత దగ్గరగా కుదిరితే అంత దగ్గరగా తీసుకురండి. ఇదే విధంగా వేరే వైపు కూడా చేయండి.

గ్లూట్​ స్ట్రెచ్​...

తొడను కదిపే కండరాలను గ్లూట్​ అంటారు. కూర్చునప్పుడు వీటిపై పడే ఒత్తిడిని తగ్గిస్తూ ఉండాలి. అందుకోసం మీ కుడి కాలును ఎడమ తొడపై పెట్టాలి. వెన్నును నిటారుగా ఉంచి ముందుకు కొద్దిగా వంగాలి. అలా వేరే వైపు కూడా చేయండి.

గ్లూట్​ స్ట్రెచ్​ చేయడం ఇలా
Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details