తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకా హత్యకేసులో వైకాపా, తెదేపా నేతలను ప్రశ్నించిన సిట్​ - వివేకా హత్య కేసులో వైసీపీ , టీడీపీ నేతల విచారణ

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో సిట్ వేగం పెంచింది. వైకాపా, తెదేపాల్లో అనుమానితులను అధికారులు కడపకు పిలిచి విచారించారు. ఈ విచారణ మరో 10 రోజుల పాటు ఉంటుందని కడప ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.

viveka murder case
వివేక హత్యకేసులో వైకాపా, తెదేపా నేతల విచారణ

By

Published : Dec 2, 2019, 6:39 PM IST

Updated : Jan 1, 2020, 10:28 AM IST

వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణను సిట్​ అధికారులు ముమ్మరం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్​, తెలుగుదేశం పార్టీలకు చెందిన కొంతమంది... అనుమానితులను కడపకు పిలిచి విచారణ చేశారు. వైకాపా నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, మరో వ్యక్తిని విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. తెదేపా నుంచి శివరామిరెడ్డి, మరో వ్యక్తిని సిట్ అధికారులు విచారించారు. అనుమానితుల విచారణ మరో 10 రోజులు ఉంటుందని కడప ఎస్పీ అన్బు రాజన్‌ తెలిపారు.

సంబంధిత కథనాలు

Last Updated : Jan 1, 2020, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details