యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ కార్యాలయాన్ని మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, కృష్ణారెడ్డి హాజరై ఎలిమినేటికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని కుర్చీలో కూర్చుండబెట్టారు. సందీప్ రెడ్డి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.
యాదాద్రి జిల్లాలో వైభవంగా జడ్పీ కార్యాలయం ప్రారంభం - జడ్పీ కార్యాలయం
యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ కార్యాలయాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లాలో వైభవంగా జడ్పీ కార్యాలయం ప్రారంభం