Yadadri Temple News: యాదాద్రిపై ప్రధాని ప్రశంసలు.. పునఃప్రారంభంపై సీఎం క్లారిటీ - యాదాద్రిపై ప్రధాని ప్రశంసలు
16:49 October 08
యాదాద్రిపై ప్రధాని ప్రశంసలు.. పునఃప్రారంభంపై సీఎం క్లారిటీ
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ(Yadadri temple news) ఉద్ఘాటన పర్వానికి అడుగులు పడుతున్నాయి. యాదాద్రి పున:ప్రారంభంపై సీఎం క్లారిటీనిచ్చారు. నవంబర్, డిసెంబర్‌లో యాదాద్రి పునఃప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ (cm kcr in assembly sessions 2021) శాసనసభ సమావేశాల్లో తెలిపారు. భారీ సుదర్శనయాగం చేసి యాదాద్రి ప్రారంభిస్తామని వెల్లడించారు. యాదాద్రి పునఃప్రారంభం ప్రధాని మోదీ (pm modi) ప్రశంసించారని.. కేసీఆర్ పేర్కొన్నారు.
వైఎస్ హయాంలో కొన్ని కార్యకమాలు జరిగి ఉండొచ్చని తెలిపారు. వైఎస్ హయాంలో తెలంగాణకు చాలా అంశాల్లో నష్టం జరిగిందని చెప్పారు. తెలంగాణ గొప్పగా పురోగమిస్తోందని వివరించారు. రాజకీయాల పేరిట రాష్ట్రాన్ని మలినం చేయొద్దని సూచించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని శపించొద్దని కోరారు. గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించామన్నారు. 57 ఏళ్లకు పింఛన్, కొత్త రేషన్‌కార్డులకు మళ్లీ అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. అనాథల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని వెల్లడించారు.