తెలంగాణ

telangana

ETV Bharat / state

yadadri: విద్యుత్ కాంతులతో మెరుస్తున్న యాదాద్రి ఆలయ సన్నిధి - యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు

yadadri: యాదాద్రి పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాత్రివేళల్లో జిగేల్ మనిపించేలా ఆలయ సన్నిధిలో విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్వాగత తోరణం కుడి పక్కన రక్షణగోడపై స్వామివారి రథోత్సవ వేడుకను చిత్రీకరించనున్నారు. మార్చి 28 న మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది.

yadadri temple
యాదాద్రి నిర్మాణ పనులు

By

Published : Feb 2, 2022, 12:03 PM IST

Updated : Feb 2, 2022, 12:17 PM IST

yadadri: మహాదివ్య క్షేత్రంగా పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్చి 28 న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం సమీపిస్తుండటంతో పనుల్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక విద్యుద్దీకరణ పనులను చేపట్టి మంగళవారం రాత్రి మరోసారి ట్రయల్ రన్ చేశారు. రాత్రివేళల్లో జిగేల్ మనిపించేలా ఆలయ సన్నిధిలో విద్యుత్ దీపాల ఏర్పాట్లు చేస్తున్నారు. సాలహారాల్లోని విగ్రహాలు, ఆలయ ప్రాకారం, అష్టభుజి మండప ప్రాకారాలు విద్యుత్​ కాంతులు వెదజల్లేలా ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

రక్షణగోడకు రథోత్సవ హంగులు

యాదాద్రి నిర్మాణ పనులు

యాదాద్రి క్షేత్ర సందర్శనకై వచ్చే భక్తులు మరిచిపోలేని విధంగా హంగులతో ఈ క్షేత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కొండపై నిర్మితమవుతోన్న భారీ స్వాగత తోరణం కుడి పక్కన రక్షణగోడపై స్వామివారి రథోత్సవ వేడుకను చిత్రీకరించనున్నారు. ఆ మేరకు నమూనాను సైతం సిద్దపరిచారు. మహాదర్పంగా సంభోద్భవుడు లక్ష్మీ సమేతంగా తిరు రథోత్సవ వేడుకలో మహాదర్పానికి నిదర్శనమైన ఐరావతం (ఏనుగు) లాగుతున్న వేడుకను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నమూనా ప్రకారం ఈ దృశ్యాన్ని రాజస్థాన్ కటౌట్లు లేదా సిమెంట్ వర్ణ చిత్రంలా రూపొందించాలా అని యోచిస్తున్నారు. ఖరారు కాగానే రక్షణగోడకు ఈ హంగులు అద్దనున్నారు. ఈ చిత్రాన్ని 20 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పులో రూపొందించనున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 2, 2022, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details