యాదాద్రి భక్తులకు ఊరట.. పార్కింగ్ అదనపు రుసుము ఎత్తివేత
17:06 May 04
పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు
యాదాద్రిలో పార్కింగ్ ఫీజు విషయంలో యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. పార్కింగ్ ఫీజు నిబంధనల్లో అధికారులు మార్పులు చేశారు. పార్కింగ్‌కు అదనపు గంటగా నిర్ణయించిన రూ.100 అదనపు రుసుము ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. కొండపైకి వెళ్లే 4 చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు రూ.500 యథాతథంగా నిర్ణయించారు. దీనితో యాదాద్రి భక్తులకు కాస్త ఊరట కలగనుంది.
యాదాద్రి కొండపైకి ఆదివారం (మే1) నుంచి భక్తుల వాహనాలను అనుమతించాలని యాదాద్రి ఆలయ అధికారులు నిర్ణయించారు. అయితే.. కొండపైకి అనుమతించే వాహనాలకు పార్కింగ్ రుసుము వసూల్ చేస్తున్నారు. కొండపైకి వచ్చే వాహనాలకు గంటకు రూ.500 రుసుం విధించారు. గంట సమయం తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు భక్తుల ఆగ్రహం మేరకు దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. అదనపు రుసుము ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి: యాదాద్రి కొండపైకి వాహనాల అనుమతి.. పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500