యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సినీ దర్శకుడు వీవీ వినాయక్.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. బుధవారం స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు.. కల్యాణానికి, తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తంను నిర్ణయించారు.