తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో మరోసారి బయటపడిన పనుల డొల్లతనం.. ఈసారి..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లోహపు దిమ్మలతో ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన పలు విద్యుత్‌ దీపాలు.. గాలి వేగాన్ని తట్టుకోలేక విరిగిపడ్డాయి. దీంతో పాటు ప్రధానాలయం రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు సైతం గాలికి నేలకూలాయి. భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ విద్యుద్దీపాలు నేలకూలినా.. అధికారులు ఏ మాత్రం స్పందించటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

యాదాద్రిలో మరోసారి బయటపడిన పనుల డొల్లతనం.. ఈసారి..!
యాదాద్రిలో మరోసారి బయటపడిన పనుల డొల్లతనం.. ఈసారి..!

By

Published : Jun 23, 2022, 3:26 PM IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధానాలయంలోని మాఢవీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల్లో నాణ్యత లోపంతో పాటు వాటి నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేకమైన డిజైన్లతో తయారు చేయించి.. లోహపు దిమ్మెలతో ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ దీపాలను ఆలయం చుట్టూ అమర్చారు. వీటిలో కొన్ని గాలి వేగాన్ని తట్టుకోలేక విరిగిపడ్డాయి. ప్రధానాలయం తూర్పు రాజగోపురం ముందున్న క్యూ లైన్లకు అమర్చిన విద్యుద్దీపాలు, ప్రహరీ గోడకు అమర్చిన పలు దీపాలు సైతం నేలకొరిగాయి.

నేలకొరిగిన విద్యుత్ దీపాలు

మరికొన్ని విద్యుత్ దీపాలు వినియోగంలో లేక.. ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల నిర్వహణను అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ వర్షానికి కొండపై ఉన్న విద్యుత్ దీపాలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నా.. అధికారులు మాత్రం సరైన చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విరిగిపడిన విద్యుత్ దీపాలు

ABOUT THE AUTHOR

...view details