Yadadri reconstruction works: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు యాదాద్రిని మహాదివ్యంగా తీర్చిదిద్దేందుకు యాడా అధికారులు శ్రమిస్తున్నారు. పాత కనుమ దారిని మెరుగు పరిచే పనులను వేగవంతం చేశారు. రెండు కనుమదారులను కలుపుకొని కొండపైన 40 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో శోభాయమానంగా నిర్మితమవుతున్న భారీ స్వాగత తోరణం పనులను పూర్తి చేసేందుకు యాడా శ్రమిస్తోంది.
Yadadri reconstruction works: శోభాయమానంగా యాదాద్రి భారీ స్వాగత తోరణం..
Yadadri reconstruction works: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొండపై చేపట్టిన కట్టడాలను గడువులోగా పూర్తి చేసేందుకు యాడా శ్రమిస్తోంది. మహా కుంభ సంప్రోక్షణకు తేదీ ఖరారు కావడంతో... రెండు కనుమ దారులను కలుపుకొని కొండపై శోభాయమానంగా నిర్మితమవుతున్న భారీ స్వాగత తోరణం పనులను వేగవంతం చేశారు.
Yadadri reconstruction works
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డు వెడల్పు చేసే పనుల నిమిత్తం... భక్తులకు చిన్న జీయర్ కుటీర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈనెల 14 నుంచి 31 వరకు (18రోజులు) నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:Yadadri Temple: పచ్చదనంతో... సహజత్వం ఉట్టిపడేలా యాదాద్రి పుణ్యక్షేత్రం