యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో గల చికెన్, మటన్ విక్రయాలు జరిపే మార్కెట్లో యాదాద్రి మున్సిపల్ కమిషనర్ రజిత పరిశీలించారు. దుకాణదారులకు పలు సూచనలు చేశారు. కరోనా నిర్మూలనలో భాగంగా పరిశుభ్రత పాటించాలని, వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిబంధనలు పాటించని 7దుకాణాలకు జరిమానా విధింపు - yadagirigutta
యాదగిరిగుట్టలో మాంసం విక్రయాలు జరిపే మార్కెట్‌ను యాదాద్రి మున్సిపల్ కమిషనర్ రజిత పరిశీలించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 7 దుకాణాలపై జరిమానా విధించారు.
నిబంధనలు పాటించని 7దుకాణాలకు జరిమానా విధింపు
ప్రతి దుకాణం ముందు శానిటైజర్ ఉండాలని, ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన 7 దుకాణాలపై జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని యాదాద్రి పురపాలక కమిషనర్ రజిత హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి ఎర్రబెల్లి