తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ఆదాయం 63 లక్షల 45వేల 754 రూపాయల నగదు, 47 గ్రాముల బంగారం, 2 కిలోల ఏడువందల గ్రాముల వెండి ఆలయ ఖజానాకు చేకూరినట్లుగా ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఒకవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా... ప్రతిసారి బాలాలయంలో ఏర్పాటుచేసే హుండీ లెక్కింపును తెలంగాణ టూరిజం హరిత కాటేజీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత కొద్ది నెలలతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గింది.
భారీగా తగ్గిన యాదాద్రి హుండీ ఆదాయం - యాదాద్రి హుండీ ఆదాయం లెక్కింపు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు.
యాదాద్రి హుండీ ఆదాయం లెక్కింపు