యాదాద్రి భువనగిరి జిల్లా.. యాదాద్రిలో జరుగుతోన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఐదో రోజు స్వామివారు.. దివ్య విమాన రథోత్సవంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
దివ్య విమాన రథంలో ఊరేగిన నారసింహుడు - శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో.. ఐదో రోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
దివ్య విమాన రథంలో ఊరేగిన నారసింహుడు
మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి:'తల్లిపాలు ఎంత విలువైనవో... మాతృభాష కూడా అంతే...'
Last Updated : Feb 27, 2021, 6:30 AM IST