తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక కల్యాణాన్ని చాటిన బ్రహ్మోత్సవాలు

ధగధగలతో మెరిసే స్వామి వారి వర్ఛస్సు... వజ్రవైఢూర్యాలతో తళుకులీనే ముఖారవిందం... ఎంత చూసినా తనివి తీరదనిపించే తన్మయత్వం... ఇవీ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వైభోగాలు. అంగరంగ వైభవంగా సాగిన వేడుకతో భక్తజనులు పులకించిపోయారు.

By

Published : Mar 16, 2019, 5:33 AM IST

Updated : Mar 16, 2019, 8:20 AM IST

లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేడుకలు

లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేడుకలు
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు లోక కల్యాణాన్ని చాటాయి. పంచనరసింహ క్షేత్రం యాదాద్రిలో... లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలు వైభవోపేతంగా సాగాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు...మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారు అమ్మవారిని తనదిగా చేసుకున్నారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్​

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్రవారం నాడు... రెండు సార్లు వివాహ వేడుకలు జరిగాయి. ఉదయం బాలాలయంలో శాస్త్రోక్తంగా చేపట్టిన వివాహ వేడుకకు భక్తులు పరిమిత సంఖ్యలో రాగా... కొండ కింద గల జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో వేలాదిగా తరలివచ్చారు. తొలి వేడుకకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరై... పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ పునఃనిర్మాణ పనుల వల్ల ఈ సారి కూడా తొలుత బాలాలయంలో.. తర్వాత కొండ కింద ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ పండితులతోపాటు చినజీయర్ స్వామి ప్రతినిధి పాల్గొని.. తీర్థజనులకు లోక కల్యాణ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు.

ఇవీ చూడండి: వైభవంగా నారసింహుడి కల్యాణం

Last Updated : Mar 16, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details