యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. శనివారం రాత్రి అశ్వవాహనంపై పట్టణ పుర వీధుల్లో శివనామ భజనలతో స్వామి వారిని ఊరేగించారు. మున్సిపాలిటీ భవన కూడలివద్ద కామ దహనం చేశారు.
కాముని పున్నమి రోజు స్వామి వారి కల్యాణం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి దేవాలయం గ్రామానికి ఈశాన్యంలో ఉండి ముఖద్వారం తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ఉండటం. రెండవది శివరాత్రి రోజు జరగాల్సిన శివపార్వతుల కల్యాణం కాముని పున్నమి తర్వాత అనగా హోలీ రోజున జరగడం విశేషం.
శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణం
అనంతరం దేవాలయం ముందు అలంకరించిన పూల పందిరిలో శివపార్వతుల కల్యాణం జరిపించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి వేడుకను తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కాముని పున్నమి తర్వాత అనగా హోలీ రోజున కల్యాణం జరగడం ఇక్కడి విశిష్టత.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం