యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మినరసింహ ఆలయ అభివృద్ధి పనులను దేవాదాయశాఖ కమిషనర్, పాలనాధికారి అనితా రామచంద్రన్ పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి ప్రత్యేక స్వాగతం పలికారు.
ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, జిల్లా పాలనాధికారి అనితా రామచంద్రన్ దర్శించుకున్నారు. ప్రధానాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డితో కలిసి ప్రధానాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనుల పురోగతిపై వైటీడీఏ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.