రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు తెరాసలో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పరిధిలోని సుమారు 200 మంది తెరాసలో చేరారు. కుంచనపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కుమునూరు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
'అభివృద్ధి పథంలో తీసుకేళ్లేందుకు కృషి చేస్తా' - telangana latest news
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పరిధిలో... వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది తెరాసలో చేరారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కమ్యూనిస్టుల పాలనలో గ్రామాభివృద్ధి కుంటుపడిందని.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీనిచ్చారు. గ్రామంలో సీసీరోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాత్రి వేళలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీధిలైట్లు ఏర్పాటు చేయటంతో పాటు.. పెండింగ్లో ఉన్న సిటీ రహదారి నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ దర్శనాల అంజయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీరాముల జ్యోతి, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ముడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సేవ చేసే వారికి ఓటు వేయండి: తలసాని, గంగుల