యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని 8 సహకార సంఘాలకు గానూ 6 సంఘాల్లోని డైరెక్టర్ స్థానాలు తెరాస పార్టీ మద్దతుదారులకే ఏకగ్రీవం అయ్యాయని తెలంగాణ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.
ఆలేరులోని 6 సంఘాల్లో డైరెక్టర్లు ఏకగ్రీవం - ఏకగ్రీవాలు తాజా వార్త
యాదాద్రి భువనగిరిజిల్లా ఆలేరు నియోజకవర్గంలో 6 సహకార సంఘాల్లోని డైరెక్టర్ పదవులు తెరాస మద్దుతుదారులు కైవసం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన సందర్భంగా ఏకగ్రీవ అభ్యర్థులను అధికారులు వెల్లడించారు.
ఆలేరులోని 6 సంఘాల్లో డైరెక్టర్లు ఏకగ్రీవం
వంగపల్లి సహకార సంఘం పరిధిలో ఏకగ్రీవంగా గెలుపొందిన అభ్యర్థులు చేసుకుంటున్న సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో ఐదు స్థానాలు, తుర్కపల్లిలో ఏడు స్థానాలు, బొమ్మలరామారంలో ఐదు స్థానాలు, రాజాపేటలో పది స్థానాలు తెరాస మద్దుతుదారులకే ఏకగ్రీవం అవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.