తెలంగాణ

telangana

ETV Bharat / state

'మమల్ని ఇతర శాఖల్లో విలీనం చేస్తే ఊరుకోబోం' - GOVERNMENT

గ్రామ రెవెన్యూ సహాయకులను పంచాయతీ రాజ్ శాఖలోకి మార్చాలనే నిర్ణయం ప్రభుత్వం మానుకోవాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న  కోరారు. వేలాది మంది కుటుంబ సభ్యులు తమపై ఆధారపడ్డారని..ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం : దాసరి వీరన్న

By

Published : Jun 11, 2019, 11:44 PM IST

గ్రామ రెవెన్యూ సహాయకులను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలనే నిర్ణయం సరైంది కాదని యాదాద్రి భువనగిరి మోత్కూర్ మండల కేంద్రంలో వీఆర్ఏ సంఘం నేతలు అన్నారు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పంచాయతీరాజ్ లేదా ఇతర శాఖలో విలీనం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వీఆర్ఏ సంఘాల రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న పేర్కొన్నారు.
వేలాది మంది వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి మారిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూప్రక్షాళన కార్యక్రమంలో రేయింబవళ్లు కష్టపడి విధులు నిర్వహిస్తూ రెవెన్యూ అధికారులకు తమ వంతు సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి : దాసరి వీరన్న

ABOUT THE AUTHOR

...view details