తెలంగాణ

telangana

ETV Bharat / state

మూసీ ప్రవాహం పెరిగింది... రోడ్డుపైకి నీరు చేరింది.. - మూసీ నది

రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దరావులపల్లి వద్ద మూసీ ప్రవాహం పెరిగింది. వరద నీటితో లోలెవెల్​ వంతెన మునిగి పోవడం వల్ల మూసీకి ఇరుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

మూసీ ప్రవాహం పెరిగింది... రోడ్డుపైకి నీరు చేరింది.

By

Published : Aug 3, 2019, 5:00 PM IST

మూసీ ప్రవాహం పెరిగింది... రోడ్డుపైకి నీరు చేరింది.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం భట్టుగూడెం - పెద్దరావులపల్లి గ్రామాల మధ్య ఉన్న మూసీ నది ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహంతో లో-లెవెల్ బ్రిడ్జి మునిగి పోవడం వల్ల నదికి ఇరుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో మార్గంలో వెళ్లాలంటే 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుండడం వల్ల ప్రవాహం ఎక్కువగా ఉన్నా లో-లెవెల్ బ్రిడ్జ్ మీదుగానే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న హై-లెవెల్​ వంతెన త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details