కార్తిక మాసం బహుళ ఏకాదశిని పురస్కరించుకుని యాదాద్రి పుణ్య క్షేత్రంలో ఈ రోజు విశేష పూజలు జరిగాయి. భక్తుల మొక్కులు, పూజలతో ఆలయంలో ఆధ్యాత్మికత నెలకొంది. బాలాలయంలో నిజాభిషేకం, సహస్రనామార్చన, అష్టోత్తరం, అలంకార సేవోత్సవాలు, శ్రీ సుదర్శన నారసింహహోమం, స్వామి వారి నిత్య కల్యాణ పర్వాలను నిర్వహించారు.
కార్తిక శుద్ధ ఏకాదశి సందర్భంగా యాదాద్రిలో లక్ష పుష్పార్చన
కార్తిక మాసం బహుళ ఏకాదశి సందర్భంగా యాదాద్రి పుణ్య క్షేత్రంలో కార్తిక ఆరాధనలు జరిగాయి. బాలాలయంలో స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహికంగా ఆచరించారు.
కార్తిక శుద్ధ ఏకాదశి సందర్భంగా యాదాద్రిలో లక్ష పుష్పార్చన
బాలాలయంలో ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రతి మాసం శుద్ధ, బహుళ ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలను సామూహికంగా ఆచరించారు.
ఇదీ చదవండి:ఉత్సవాలు చేయడం కాదు.. గౌరవం కాపాడాలి : బండి సంజయ్