కూరగాయలకు రెక్కలోచ్చాయ్...! - hike
పెరిగిన కూరగాయల ధరలతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.
కూరగాయలకు రెక్కలోచ్చాయ్...!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కూరగాయల మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు కిలో 70 నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. వారం రోజుల క్రితం కిలో 20రూపాయలు ఉన్న టమాటా నేడు 80 రూపాయలకు చేరుకుంది. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే 500 పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.