యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలోని తులసీ కాటేజీ ప్రాంగణంలో ఉన్న యాదరుషి మహర్షి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం ధ్వంసం చేశారు. విగ్రహం చేతులు విరగ్గొట్టి, విడి భాగాలను అక్కడే పడేశారు. ఇది గమనించిన భక్తులు యాదరుషి విగ్రహాన్ని నూతన వస్త్రాలతో కప్పివేశారు.
యాదాద్రిలో యాదరుషి విగ్రహం ధ్వంసం.. భక్తుల ఆగ్రహం
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలో ఉన్న యాదరుషి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.
యాదాద్రిలో యాదరుషి విగ్రహం ధ్వంసం.. భక్తుల ఆగ్రహం
ఈ సంఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి ఆలయానికి మూల కారణం యాదరుషి అని... ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి విగ్రహం చుట్టూ తాత్కాలిక కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఎక్కడెక్కడ... ఎలాంటి రుచులు ఆస్వాదించాలో చెబుతారు వీరు!