యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శుక్రవారం నిత్య ఆరాధనలతో హరిహరులు భక్తులను అలరించారు. బాలాలయంలో పంచ నరసింహులను కొలుస్తూ, అభిషేకం అర్చనలు చేపట్టారు. నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం చేశాక బిందే తీర్థం, బాలభోగం నిర్వహించి ఉత్సవమూర్తులకు అభిషేకం అర్చనలు జరిపారు. ఉత్సవమూర్తులను స్వర్ణ పుష్పాలతో అర్చించారు. సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణోత్సవం, గజవాహన సేవను చేపట్టారు.
యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్ సేవ - yadadri
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు.
సాయంత్రం బాలాలయ మండపంలో ఆండాళ్ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు వివిధ రకాల పూలతో, తులసి దళాలతో పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, అర్చక స్వాములు ఊంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాళ్ అమ్మవారికి హారతినిస్తూ కీర్తన చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు, మొదటగా శ్రీ మన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారుచేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖమండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ, లాలిపాటల కోలాహలం కొనసాగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శించుకున్నారు.
ఇవీ చూడండి; యాదాద్రీశున్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్