తెలంగాణ

telangana

ETV Bharat / state

మోత్కూరులో హిమలింగేశ్వరుడు - జ్యోతిర్లింగాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్​కు దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. ఈ యాత్రలో వారు కఠినమైన వాతావరణ పరిస్థితులు, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన ఇద్దరు బాలికలు.. ఇంట్లోనే మంచు శివలింగాన్ని తయారు చేశారు. ఈ హిమలింగేశ్వర విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

హిమలింగేశ్వరుడు
హిమలింగేశ్వరుడు

By

Published : Jun 16, 2021, 10:17 PM IST

జ్యోతిర్లింగాల్లో అమర్​ నాథ్ పుణ్యక్షేత్రాన్ని ఎంత గొప్పగా భావిస్తామో.. ఆ మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోవాలన్న అంతే కష్టతరం. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో యాత్ర వీలుకాని తరుణంలో యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన ఇద్దరు బాలికలు.. ఇంట్లోనే మంచు శివలింగాన్ని తయారు చేశారు. ఈ హిమలింగేశ్వర విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఏనిమిదో తరగతి చదుతున్న అక్షయ, ఆమె చెల్లలు హర్షశ్రీతో కలసి తయారు చేసిన ఈ మంచు శివలింగాన్ని చూడటానికి ఇరుగుపొరుగు వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గతేడాది జూన్ మాసంలో కూడా హిమలింగేశ్వర విగ్రహాన్ని తయారు చేసినట్లు చిన్నారులు గుర్తు చేశారు.

ఇదీ చదవండి:చనిపోయిన యజమాని ఫొటో చూస్తూ విలపిస్తున్న శునకం

ABOUT THE AUTHOR

...view details