మిర్యాలగూడ, వేములపల్లి, సూర్యాపేట, కేతేపల్లి మండలాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డు మొత్తం కంకర తేలి ద్విచక్ర వాహనాల వారు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి లేచి కళ్లలో పడుతుండగా ప్రయాణికులు అనారోగ్యం పాలవుతున్నారు. రాత్రివేళలో ప్రయాణించాలంటే మరిన్ని ఇబ్బందులు తప్పడంలేదు. పొలాలకు వెళ్లలేకపోతున్నామని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు మంజూరు చేస్తే
ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే 15 రోజుల వ్యవధిలో నిర్మాణ పనుల్ని పూర్తి చేయిస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సింహా పేర్కొన్నారు. గుత్తేదారుకు రూ.4 కోట్లు మాత్రమే ఇవ్వగా ఇప్పటికి 60 శాతానికి పైగా పనులు పూర్తిచేశారు. నిధుల సమస్యతో మిగతా పనులు నిలిపివేశారు.
నిధుల కేటాయింపు
శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి నుంచి భీమారం వరకు 28 కి.మీ. విస్తరించాల్సి ఉంది. మొదటి దశలో భీమారం నుంచి మొల్కపట్నం వరకు 20 కి.మీ.కు రూ.35 కోట్లు కేటాయించారు. రెండో దశలో మొల్కపట్నం నుంచి శెట్టిపాలెం వరకు 8 కి.మీ. రూ.8.20 కోట్లు కేటాయించారు.