యదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి, దేవరకొండ ప్రాంతంలోని చాలా మండలాల్లోని ప్రజలు నీటి సమస్య తీర్చనుంది... భూగర్బ జలాలు పెంపే లక్ష్యంగా... ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు 125 చెక్‌డ్యాంలు మంజూరు చేసింది. వీటి నిర్మాణం కోసం రూ.300 కోట్ల నిధులకు పాలనాపరమైన అనుమతులను సైతం ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేసింది. రెండు విడతలుగా పనులు..జిల్లాకు మంజూరైన 125 ఆనకట్టల నిర్మాణ పనులను రెండు విడతలుగా చేపట్టనున్నారు. అందులో భాగంగా మొదటి విడతలో 63 చెక్‌డ్యాంలను నిర్మిస్తారు. ఇందుకు వ్యయం చేసే రూ.150 కోట్ల నిధులు సైతం విడుదలయ్యాయి. మిగిలిన 62 చెక్‌డ్యాంలను వచ్చే ఏడాదిలో నిర్మిస్తారు. మొదటి విడతలో చేపట్టబోయే పనులు ఈ నెలలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దేవరకొండలో 125 చెక్‌డ్యాంలు - దేవరకొండలో
వేసవిలో ఈసారి ఉష్ణోగ్రతల ఎక్కువయ్యాయి. తటాకాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోని నీరంతా ఆవిరయ్యాయి. తాగు, సాగు నీటి ఇబ్బందులు పోవాలంటే... భూగర్భజలాల రక్షణ, పెంపులే తక్షణ ప్రత్యామ్నాయాలుగా నీటిపారుదల శాఖ భావించింది. యదాద్రి భువనగిరి జిల్లాలోని చిన్న, మధ్య, భారీ జలవనరుల్లో ప్రవహిస్తున్న నీటిని వీలైనంత మేరకు భూగర్భంలో దాచుకునేలా ప్రణాళికలు రచించింది.
దేవరకొండలో 125 చెక్‌డ్యాంలు
చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు ముగిశాయి. క్షేత్రస్థాయిలో రూపొందిన ప్రాథమిక నివేదికలన్నీ ఉన్నతాధికారులకు చేరాయి.త్వరలో వాటికి సాంకేతిక అనుమతులుమంజూరు కానున్నాయి. వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.ఇప్పటికే టెండర్లు పిలిచేందుకు అవసరమైన ప్రక్రియ సైతం ముగిసిందని నల్గొండ ఐబీ సీఈ హామీద్‌ఖాన్ తెలిపారు.
ఇదీ చూడండి : సూర్యాపేట జిల్లాలో ఇద్దరు ఆంధ్రావాసుల మృతి