తెలంగాణ

telangana

ETV Bharat / state

చల్లారని గ్రామస్థుల ఆగ్రహజ్వాలలు - bhongir

అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలను ఓ మానవ మృగం మింగేసింది. అభం, శుభం తెలియని చిన్నారులను చిదిమేసి బావిలో పూడ్చిపెట్టాడు. ఉదంతం మొత్తం బయటపడిన తర్వాత ఆ గ్రామస్థుల ఆగ్రహజ్వాలల్లో నిందితుడి ఇళ్లు తగలబడిపోయాయి.

చల్లారని గ్రామస్థుల ఆగ్రహజ్వాలలు

By

Published : Apr 30, 2019, 7:28 PM IST

Updated : Apr 30, 2019, 11:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్​లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రావణి, మనీషాల హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్​రెడ్డి ఇళ్లపై గ్రామస్థులు దాడికి దిగారు. నిన్ననే ఇంటికి తాళం వేసి నిందితుడి తల్లిదండ్రులు వెళ్లిపోయారు.

చల్లారని గ్రామస్థుల ఆగ్రహజ్వాలలు

తొమ్మిదో తరగతి అమ్మాయి... చదువే లోకంగా బతుకుతోంది. అలాంటి అమ్మాయిని అతి కిరాతకంగా ఆత్యాచారం చేసి.. చంపేసి బావిలో పూడ్చిపెట్టారు. నెల క్రితం డిగ్రీ విద్యార్థిని మనీషాని కూడా హతమార్చాడు. అదే బావిలో పూడ్చిపెట్టాడు. ఈ రెండు హత్యలతో గ్రామస్థులు అతనిపై ఆగ్రహంతో ఉన్నారు.

మరోవైపు కల్పన అనే 11 ఏళ్ల అమ్మాయిని కూడా అతనే చంపేసినట్లు పోలీసులు, గ్రామస్థులు అనుమానిస్తున్నారు. వరుస హత్యలకు కారణమైన శ్రీనివాస్​రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో గ్రామస్థులు ఉన్నారు.

ఇవాళ ఉదయం శ్రీనివాస్​రెడ్డికి చెందిన రెండు ఇళ్లను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పంటించారు. వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అయినా ఆగ్రహ జ్వాలాలు చల్లారలేదు. అలాంటి మానవ మృగాలు బయట తిరగకూడదని... బహిరంగంగా ఉరి తీయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: హాజీపూర్​ బావిలో మరికొన్ని అస్థికలు లభ్యం

Last Updated : Apr 30, 2019, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details