ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఇవాళ ఉదయం భాజపాలో చేరనున్నారు. దిల్లీలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు భాజపాలో చేరుతున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు.
నేడు భాజపాలో చేరనున్న భిక్షమయ్య గౌడ్
ఆలేరు తెరాస మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భాజపాలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భాజపాలో చేరుతున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు.
లేఖలో ఏమన్నారంటే.. ‘‘ఆలేరు అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు 2018లో తెరాసలో చేరా. అభివృద్ధిలో నన్ను భాగస్వామిని చేస్తారని భావించా. ఇక్కడి ప్రజలు, నన్ను వేరు చేసేందుకు కుట్ర చేశారు. ఇక్కడ తిరగొద్దని.. ప్రజలను కలవొద్దని తెరాస పెద్దలు ఆదేశించారు. మూడేళ్లుగా ఆలేరు ప్రజలను కలవకుండా కట్టడి చేశారు. ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్రను నేను ఛేదించాను. ఆలేరు ప్రజలకు సేవ చేసేందుకే భాజపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నా’’ -భిక్షమయ్య గౌడ్
ఇదీ చదవండి:CM KCR: 'జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోంది'